
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఓ.వి. రోడ్లోని శ్రీ గాయత్రి ఈ-టెక్నో స్కూల్లో నేడు ప్రీ గణేష్ చతుర్థి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, నల్లమట్టితో స్వయంగా వినాయక విగ్రహాలను తయారు చేశారు.పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సహజసిద్ధమైన మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేయించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను రూపొందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, వినాయక చతుర్థి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ముఖ్యమైన పండుగ అని తెలిపారు. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకతతో ప్రీ గణేష్ చతుర్థి వేడుకలు పాఠశాల ప్రాంగణంలో సందడి వాతావరణాన్ని నెలకొల్పాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.