
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీల శ్యామసుందరి పాల్గొని, లోక్ అదాలత్ ద్వారా వివాదాలను సత్వరంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు.సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా లోక్ అదాలత్ ప్రాముఖ్యత, రాజీ ద్వారా కేసుల పరిష్కారం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్నలూరు ఎస్ఐ సత్యనారాయణ, కొండేపి ఎస్ఐ త్యాగరాజు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. కక్షిదారులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించారు.