
తొలి శుభోదయం న్యూస్ త్రిపురాంతకం:-
నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ప్రజల చిరకాల కల సాకారమైన ఈ చారిత్రాత్మక సందర్భంలో ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారుతో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.త్రిపురాంతకం మండలం మిరియంపల్లి – ఆవులమంద – చందవరం రోడ్డు వరకు రూ. 2.70 కోట్ల వ్యయంతో నిర్మించిన గుండ్లకమ్మ వాగు బ్రిడ్జి మరియు BT రోడ్డుతో ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుంది.ప్రజల అవసరాలను గుర్తించి, చిరకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
అభివృద్ధి అడుగులు… ప్రజల జీవితాల్లో మార్పులు!