
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
కోర్టుకు హాజరైన ఇరుపక్షాలకు కౌన్సెలింగ్ – పరస్పర అవగాహనతో సమస్యల పరిష్కారానికి పోలీసుల కృషి
మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. వివిధ కేసులకు సంబంధించి కోర్టుకు హాజరైన ఇరుపక్షాలకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, కేసుల కారణంగా ఏర్పడిన విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.ఇరుపక్షాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, చట్టపరమైన పరిష్కారంతో పాటు పరస్పర అవగాహన, సామరస్యం మరియు శాంతియుత వాతావరణం ఏర్పడేలా పోలీసులు సూచనలు అందించారు. చిన్నచిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకుండా పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.మెగా లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి సహకరిస్తూ, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా పోలీసు శాఖ తన వంతు సహకారం అందించింది. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు.