
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అలగాయపాలెం బీచ్, రామాయపట్నం బీచ్లలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన – వెలుతురు, పీఏ సిస్టమ్, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు
గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ (క్రైమ్స్) గారు అలగాయపాలెం బీచ్ మరియు రామాయపట్నం బీచ్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రాంతాలను సందర్శించి, అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన ప్రాంతాల్లో తగినంత లైటింగ్, పబ్లిక్ అడ్రస్ (PA) సిస్టమ్, శిక్షణ పొందిన ఈతగాళ్లను (Swimmers) అందుబాటులో ఉంచాలని కందుకూరు సర్కిల్ సీఐ గారికి మరియు సంబంధిత పోలీసు సిబ్బందికి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జన సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.గణేష్ నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, సురక్షితంగా మరియు క్రమబద్ధంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.