
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పెద్ద బజారు నందు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ విగ్రహ కర్త పబ్బిశెట్టి వరదరాజ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా బోణాల శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. సింగమనేని పల్లి గ్రామవాసులకు ఈ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి వినాయక చవితికి బోణాల శ్రీనివాస చక్రవర్తి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమం అని అన్నారు. ప్రతి ఒక్కళ్ళు వినాయక చవితి మట్టి గణపతిని పూజించే పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి సుధీర్ కుమార్, కోట కిషోర్ బాబు, ఇస్కాల మధుసూదన్ రావు, గొల్ల వెంకన్న, వేముల సుధాకర్, పబ్బిశెట్టి పవన్, కొలిపర్తి సురేంద్ర, మునగా సత్యం, వెల్లంపల్లి హజరత్, ఇస్కాల మురళి, మద్దాళి నాగరాజు, వెల్లంపల్లి మస్తానయ్య, కంకణాల వెంకటేశ్వర్లు, ఇస్కాల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.