
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
కొడుకుకు న్యాయం కోసం నెలల తరబడి పోరాడిన మౌలాబి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కంబం ముస్లిం యూత్ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆదివారం మీటింగ్ అనంతరం కమిటీ ఆధ్వర్యంలో 5 నిమిషాల నిరసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం కంబం RTC బస్టాండ్లో నిరసన బ్యానర్లు ఏర్పాటు చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఐక్యంగా నిలబడాలని కమిటీ పిలుపునిచ్చింది.