
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు మున్సిపాలిటీకి సంబంధించి 2026లో నిర్వహించనున్న సాధారణ మున్సిపల్ ఎన్నికలలో చైర్పర్సన్/వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితా 13.09.2026న ప్రచురించబడినట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ మరియు గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ నం. 525/SEC-F2/2026, తేదీ 07.09.2026లోని సూచనల మేరకు తుది పోలింగ్ కేంద్రాల జాబితాను గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో మరియు ఎన్నికల సంఘం సూచించిన ఇతర ప్రదేశాల్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
అదేవిధంగా, తుది జాబితా జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, జిల్లా కోర్టు/సబ్‌కోర్టు, మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు, ప్రభుత్వ గ్రంథాలయాలు, పోస్టాఫీసులు, బ్యాంకులు మరియు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో కూడా పరిశీలనకు అందుబాటులో ఉండేటట్లుగా పేర్కొన్నారు.
ఎన్నికలకు సంబంధించిన ప్రొఫార్మా సమాచారం మరియు పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను అనుబంధాలు V, లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ & మున్సిపల్ కమిషనర్ గిద్దలూరు మున్సిపాలిటీ