
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నీరు లేకపోవడంతో, స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కంచిపల్లె మాజీ సర్పంచ్ దప్పిలి శ్రీనివాసరెడ్డి , మరియు కంచిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు, కంచిపల్లె చెరువులో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపే ఏర్పాటు చేశారు.ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని, భక్తులందరూ కంచిపల్లె చెరువు వద్దకు వచ్చి నిమజ్జనం చేసుకోవాలని ఆయన కోరారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం తాగునీటి సదుపాయంతో పాటు అల్పాహారాన్ని (టిఫిన్) కూడా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.