
తొలి శుభోదయం న్యూస్ కొండపి:-
కొండపి మండలం పెదకండ్లగుంట గ్రామంలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య.అనంతరం ఆ గ్రామంలో ఈ నెల 21 తేదీన జరగనున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మరియు దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పై స్థానిక మండల & గ్రామ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది.