
జూదానికి అడ్డుకట్ట.. రూ.4,000 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
చింతలపాలెం జగనన్న కాలనీలో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో జరగుమల్లి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.4,000/- నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో జూదం వంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.జూదానికి చెక్.. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం!