
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యుడు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డా. ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంపాటలో పాత సింగరాయకొండ గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దాసరి శేషయ్య ₹27,000కు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అంగరంగ వైభవంగా నిమజ్జనానికి తరలించారు.ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.