
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా గిద్దలూరు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, కులవృత్తిదారులు తదితరులు పాల్గొని విశ్వకర్మ భగవాన్‌కు నివాళులర్పించారు. సృష్టి నిర్మాణానికి, వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా భావించే శ్రీ విశ్వకర్మ భగవాన్ సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు.సాంప్రదాయ వృత్తులను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దత్తచారి, రంగాచారి, ఆంజనేయ ఆచారి, రత్నం చారి, బాల బ్రహ్మచారి, శేఖర్ ఆచారి, రాయనూతల ఆంజనేయ ఆచారి, విశ్వరూప ఆచారి తదితరులు పాల్గొన్నారు.