
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు గురువారం ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టరు లక్ష్మీ కుమారి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సౌకర్యం మరియు సలహాలు కల్పించడంతోపాటు ఉచితంగా అనేక రకాల జబ్బులకి మందులు అందజేయడం జరిగింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యం మరియు పోషకాహారం పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవి కుమార్, అధ్యాపకులు డాక్టర్ ఎన్వి. శ్రీహరి, డాక్టర్ ఎన్ .తిరుపతి స్వామి, డాక్టర్ సిహెచ్ .సురేష్ కుమార్, శ్రీ కరుణ రత్నకుమార్, డాక్టర్ డి. మోషే, శ్రీ ఎస్ డి ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థినీ విద్యార్థులు ఎంతో చురుగ్గా పాల్గొని విజయవంతం చేశారు.