
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న దూరదృష్టి గల నాయకుడు, కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిస్తున్న గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన తెలియజేసారు. పుట్టినరోజు సందర్బంగా ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు ఈరోజు సాయంత్రం ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు పార్టీ నాయకులతో కలిసి కొవ్వుతుల్లు వెలిగించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ నరేంద్రమోడీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన ప్రత్యేక గుర్తింపును చాటుకుంటోంది. ‘సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్’ అనే స్ఫూర్తితో దేశంలోని ప్రతి వర్గం అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం అన్ని తెలియజేసారు, మీకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలతో నిండిన సంపూర్ణ జీవితం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు.భారతదేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రపంచంలో మరింత ఉన్నత స్థానానికి చేర్చాలని ఆకాంక్షిస్తున్నాను తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.