
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు.శుక్రవారం ఉదయం బిట్రగుంట గ్రామంలో పల్లపాటి సాంబశివరావు (55), గౌడ, బిట్రగుంట గ్రామం నివాసం వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి, అతని వద్ద ఉన్న ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ కు చెందిన 30 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అక్రమంగా మద్యం విక్రయించే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని జరుగుమల్లి పోలీసులు తెలిపారు.