
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం పట్టణ శివార్లలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి కిలో గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ డాక్టర్ యు. నాగరాజు మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో సీఐ అల్తాఫ్ హుస్సేన్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. సాయిబాలాజీ థియేటర్ సమీపంలోని కంపచెట్లలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి బయటపడిందన్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు.