
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:-
గిద్దలూరు పట్టణంలో అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. తోపుడుబండ్లను ఇష్టారాజ్యంగా రోడ్లపై ఏర్పాటు చేయరాదని, వాహనాలను రోడ్లపై నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని తెలిపారు.