
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు ప్రజలకు మరింత భద్రతా భావన కల్పించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు, ప్రయాణికుల భద్రత, అనుమానాస్పద వ్యక్తులు మరియు కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ప్రయాణికులు, వ్యాపారులు మరియు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్ పరిసరాల్లో ఫుట్ పెట్రోలింగ్, నిరంతర నిఘా మరియు పోలీసుల కనిపించే విధంగా విధుల నిర్వహణ ద్వారా ప్రజలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు కృషి చేస్తున్నారు.