
మార్కాపురం కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
కార్మికుల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి : సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ
ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, ఆర్థిక సహాయం, విద్యా–వివాహ, ప్రసూతి ప్రయోజనాలు అందించాలని డిమాండ్ ప్రమాదాల్లో మృతి చెందిన, అంగవైకల్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలి పెండింగ్ సంక్షేమ పథకాల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ కొత్త భవన నిర్మాణ కార్మికుల కార్డుల నమోదు, పాత కార్డుల రెన్యువల్ చేపట్టాలి 60 ఏళ్ల నుంచి భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్, మృతుల భార్యలకు పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ ఈనెల 30న ఏఎల్వో కార్యాలయం వద్ద సామూహిక రాయబారం నిర్వహించనున్నట్లు వెల్లడి అక్టోబర్ 8న కలెక్టరేట్ ధర్నాను కార్మికులు జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుల పిలుపు….