
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:-
తూర్పు నాయుడుపాలెంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న ఆహ్లాద కేంద్రాన్ని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సందర్శించారు.ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ కేంద్రంలో జరుగుతున్న వాకింగ్ ట్రాక్, పిల్లల పార్క్, సోలార్ లైట్లు, బెంచీల ఏర్పాటు, కాలువకు రివెట్మెంట్ పనులను పరిశీలించారు. పనుల ప్రస్తుత పరిస్థితి, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దేలా పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి గారు సూచించారు.