
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు ప్రకాశం జిల్లా కార్యాలయం వద్ద జై భీమ్ రావు భారత్ పార్టీ, విసికె పార్టీ, ముస్లిం & అనుబంధ సంఘాలు, ఆంధ్ర ప్రదేశ్ దళిత మహాసభ, CPI మరియు అనుబంధ సంఘాలు, CPM మరియు అనుభంద సంఘాలు, PDSU & అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, మాల ఉద్యోగులు, JAC & అనుబంధ సంఘాలు, MRPS & అనుబంధ సంఘాలు, తదితర రాజకీయ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు "KV కృష్ణారావు" మాట్లాడుతూ,,,,
సింగరాయకొండ లో అనుమతులు లేకుండా నిర్వహిస్తూ ఈ సంవత్సరం పెబ్రవరి నెల 14:02'2026 వ తేదీన కనిగిరికి చెందిన 11 సం.. రాల "తౌసిక్" అనే చిన్న పిల్ల వాడిని కొట్టి చంపి ఆత్మ హత్య లాగా చిత్రికరించడం జరిగింది
అప్పటి నుంచి తౌశిక్ తల్లి మౌలా బి సింగరాయకొండ SI, CI దగ్గర నుంచి అసెంబ్లీ, సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు దాకా పోరాటం చేసింది.గతంలో జరిగిన "త్రి మెన్ కమిషన్" నివేదిక బహిర్గతం చేయలేదు ఎందుకని
ఈ నెల 10వ తేదీ మౌలాభి మరణ వాంగ్మూలం ఇచ్చినా కానీ నేటికీ వాంగ్మూలం అగమ్యగొచరంగా ఉంది. ఈ నెల 16వ తేదీ ప్రకాశం జిల్లా డీఈఓ గారు ఆ యొక్క సింగరాయకొండ చైతన్య స్కూల్ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది అయినప్పటికీ నేటికీ కూడా ఆ స్కూల్ రన్ అవుతూనే ఉంది. ఎందుకని దర్శి డిఎస్పి 16వ తేదీ మౌలాబి మృతదేహాన్ని ఖననం చేయించడానికి ఇచ్చిన హామీ రెండు రోజుల్లో స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేస్తాము అన్న మాటలు ఏమయ్యాయి ప్రకాశం జిల్లా ఎస్పీ 16వ తేదీ ఇచ్చిన స్టేట్మెంట్ కేసును తప్పు దోవ పట్టించేలా ఉంది. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం పోలీసు యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇదే తరహాలో అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వారికి జరిగితే రాజకీయ వ్యవస్థ మొత్తం అక్కడే ఉండి ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా నిలబడుతుంది కానీ ఒక పేద ముస్లిం కుటుంబానికి జరిగితే కనీసం పరామర్శించని జిల్లా అధికార యంత్రాంగం స్థానిక అధికార పార్టీ నాయకులు సాంఘిక సంక్షేమ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ ఏం చేస్తుందని జై భీమ్ రావు భారత్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు "KV కృష్ణారావు" ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు "మెడసల ఆదినారాయణ", ఇండియన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఎస్డిపిఎల్ నాయకులు ముస్లిం నాయకులు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర కార్యదర్శి "చిట్టిమాల సంపత్ కుమార్" జాతీయ సంఘం జాతీయ అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ, ఎం ఆర్ పి ఎస్ నాయకులు "జండ్రాజుపల్లి ఆంజనేయులు" PDSU జిల్లా బాధ్యులు సిహెచ్ సాగర్, CPI జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఆయా సంఘాల నుంచి విరివిగా ప్రజలు పాల్గొని మహాధర్నాని జయప్రదం చేశారు.తదుపరి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కి మెమో రండం సమర్పించడం జరిగినది.