
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లా ఒంగోలులోని హర్షిణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు పాల్గొన్నారు.యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గనిర్దేశం, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన అవకాశాలు అందించడంపై కార్యక్రమంలో చర్చ జరిగింది. విద్యతో పాటు ఉపాధి, నైపుణ్యాలు, కెరీర్ అవకాశాలపై యువతకు అవగాహన కల్పించే దిశగా యువత భవితకు భరోసా కార్యక్రమం కొనసాగుతోంది.
యువత ఆశయాలకు అండగా నిలిచి, వారి ప్రతిభకు తగిన అవకాశాలు కల్పిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కుటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు.