
ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు
ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువ కావాలనే లక్ష్యంతో పామూరులో ప్రత్యేక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న పామూరు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు.
పామూరులో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంకు 41 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడం, పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ గారు, పోలీస్ అధికారులు సోమవారం పామూరు సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పామూరు పట్టణం మరియు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ గారు స్వీకరించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.అలాగే, ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ గారు వారి సమస్యల పూర్వాపరాలను సమగ్రంగా తెలుసుకుని, వాటిని చట్టపరంగా పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మీ కోసం’ కార్యక్రమానికి అందిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన న్యాయం అందించాలన్నారు. పిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా నివేదిక అందించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పోలీసు వ్యవస్థను ప్రజలకు మమేకం చేయడంలో భాగంగా ఈ ప్రత్యేక మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, పామూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వారి సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ప్రతి సోమవారం ప్రత్యామ్నాయంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అదే విధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కూడా యథావిధిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. మీకోసం ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి స్థాయి విచారణ జరిపి సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ ప్రత్యేక మీకోసం కార్యక్రమంలో కుటుంబ కలహాలు, చీటింగ్, భర్త/అత్తారింటి వేదింపులు, భూ & ఆస్థి వివాదాలు మరియు ఇతర సమస్యలపై పిర్యాదులు అందాయి.అదే విధంగా సోమవారం మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం సీఐ అజయ్ కుమార్ మరియు అధికారులు నిర్వహించిన మీకోసం కార్యక్రమంకు 36 ఫిర్యాదులు అందినాయి. ఈ కార్యక్రమంలో కనిగిరి ఇంచార్జి డిఎస్పీ పి.శ్రీధర్, పామూరు సీఐ వినోద్ కుమార్,పొదిలి సీఐ రాజేష్ కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.