
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల గృహ నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ— ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సహాయాన్ని ₹1.80 లక్షల నుంచి ₹2.50 లక్షలకు పెంచాం.అర్హులైన ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఉచిత ఇసుక విధానం ద్వారా పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుకను రవాణా ఖర్చులకే అందిస్తున్నాం.మూడో విడతలోనూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పనులు చేపడుతున్నాం.ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న ప్రతి లబ్ధిదారుడికి హృదయపూర్వక అభినందనలు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ఆనందంగా గృహప్రవేశాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.