
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, విద్య, పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.
టి.పి.నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, వారికి అందుతున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలను వివరించారు. చిన్నారుల ఎదుగుదలలో పోషకాహారం, పరిశుభ్రత, క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యమని తెలిపారు.ఈ సందర్భంగా CDPO అంజమ్మ గారి సూచనలమేరకు ఊళ్ళపాలెం సెక్టార్ సూపర్వైజర్ సైదాబీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి చిన్నారి వివరాలను నమోదు చేసి, వారి ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. తల్లిదండ్రులు కూడా అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లిదండ్రులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.