
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీ మరియు ప్రజాప్రతినిధుల సేవలను అభినందిస్తూ ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొని, తాళ్లూరు ఎంపీపీ శ్రీమతి నాగలక్ష్మి గారు, జడ్పీటీసీ మారం వెంకారెడ్డి గారు, వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వర రెడ్డి గారు, ఎంపీటీసీ సరస్వతి–ప్రభాకర్ రెడ్డి గార్లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ, మండల అభివృద్ధికి, ప్రజలకు సేవలందించడంలో ప్రజాప్రతినిధులు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.