
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం.పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం ఎంతో కీలకం. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాల ప్రాంగణాలు, కాంపౌండ్ వాల్స్ వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా హరిత వాతావరణాన్ని పెంపొందించవచ్చు.అలాగే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి రూ.18–19 కోట్ల సిమెంట్ రోడ్లు, సుమారు రూ.7–8 కోట్ల బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేసినందుకు డీపీఓ/పీడీ గారికి, కలెక్టర్ గారికి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.జిల్లాలో మొత్తం 17 పాఠశాలలు ఎంపిక కాగా, అందులో 10 పాఠశాలలు మన నియోజకవర్గం నుంచి ఎంపిక కావడం సంతోషకరం. ఈ మంచి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ప్రారంభించినందుకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.మన నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తాను.