
నీతి, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకకురావాలన్న మంత్రి స్వామి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
పోలీసులు నీతి, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డా.శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం ఒంగోలు పోలీస్ శిక్షణా కాలేజి నందు మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమములో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 9 నెలల కఠోర శిక్షణ అనంతరం ప్రత్యక్ష విధులలో చేరుతున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోలీసు ట్రైనింగ్ స్టైఫండ్ రూ. 4,500 నుంచి రూ. 12,500 కి పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి తెలిపారు. పోలిస్ యూనిఫారం వేసుకొని న్యాయం, ధర్మం, చట్టాన్ని కాపాడుతూ ప్రజలకు న్యాయం చేయాలన్నారు. రానున్న రోజులలో వస్తున్న సైబర్ క్రైం వంటి విభిన్న పోకడలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. సుసిక్షితమైన శిక్షణ అనంతరం విధులలో ప్రత్యక్షంగా చేరడం జరుగుతుందన్నారు. శాఖకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు. అంతా తెలుసు అనే ధోరణి వీడి అవసరమైనప్పుడు సినియర్ల సలాహాలు, సూచనలు తీసుకోలన్నారు. పోలీస్ యూని ఫారం చూడగానే సమాజం గౌరవించేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. యూనిఫారం ఇచ్చిన పవర్ ని గౌరవంగా చూసుకోవాలన్నారు. ప్రజల రక్షణ, మహిళల భద్రతలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ రాధిక పాల్గొన్నారు.