
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కొనిజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించబడింది.కొనిజేడు పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా. దివ్య శ్రీ జడ్పీహెచ్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బంది సహకారంతో అందించారు.విద్యార్థుల్లో నులిపురుగుల నివారణ, ఆరోగ్య పరిరక్షణ మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ శ్రీనివాసులు, స్కూల్ హెచ్ఎం బ్రహ్మయ్య మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.