
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ గీతం స్కూల్ లో నిర్వహించిన స్క్రీన్ రాకెట్ వర్క్ షాప్ ను విద్యార్థులు రాకెట్ ను మొదటి నుంచి తమ చేతులతో నిర్మించి, విజయవంతంగా ప్రయోగించారు. ఈ సందర్భంగా గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన రాకెట్ సుమారు 300 మీటర్లు ఎత్తుకు చేరుకోవటం విశేషం. పుస్తకాల్లోని సైన్స్ ను ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా నేర్పిస్తూ, విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కారం సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఈ విజయానికి కొనసాగింపుగా డిసెంబర్ లో సుమారు 5 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యంగా చేసుకొని మరింత భారీ రాకెట్‌ను ఉపయోగించేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తాజురుద్దీన్, ధనలక్ష్మి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.