
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు
సింగరాయకొండలోని మాలినేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. లావణ్య, మెడికల్ ఆఫీసర్, సింగరాయకొండ హాజరయ్యారు.
అనంతరం కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సిహెచ్ . సాయిబాబు మాట్లాడుతూ, సమాజంలో ఫార్మసిస్ట్‌ల పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు.
ఫార్మసిస్ట్ అంటే కేవలం మందుల తయారీకి మాత్రమే పరిమితం కాదని, మందులను ఎలా ఉపయోగించాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, మందుల వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు వంటి విషయాలపై రోగులకు సరైన అవగాహన కల్పించడంలో ఫార్మసిస్ట్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని వివరించారు. రోగులు మందులను వైద్యుల సూచనల ప్రకారం సరైన మోతాదులో, సరైన సమయంలో ఉపయోగించేలా మార్గనిర్దేశం చేయడం కూడా ఫార్మసిస్ట్‌ల బాధ్యతలో ముఖ్యమైన భాగమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాలినేని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ డైరెక్టర్ డా. ఏ .జి .కె . మూర్తి, కళాశాల ఫార్మసీ అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ద్వారా ప్రజలకు ఫార్మసిస్ట్‌ల ప్రాముఖ్యత మరియు బాధ్యతలపై అవగాహన కల్పించారు.
“ఫార్మసిస్ట్ – ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగస్వామి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.