
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు రెండో రోజు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.ఉత్సవాల్లో భాగంగా అకల్మష హోమం, యాగశాల వాస్తు హోమం, రుత్విక్ వరణం, రక్షా సూత్రధారణ, విశేష స్నపన తదితర వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.