
సెప్టెంబర్ 26న జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించటం జరుగుతుంది
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తమామిడిపాలెం జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ నందు 2025 బ్యాచ్‌కు చెందిన SCTPC (Civil-men) 190మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్ శుక్రవారం క్రమశిక్షణాయుత వాతావరణంలో నిర్వహించడం జరిగింది.రిహార్సల్లో భాగంగా ట్రైనీ కానిస్టేబుళ్లు నిర్వహించిన కవాతు, మార్చ్‌పాస్ట్‌ను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పిఎస్., గారు పరిశీలించారు. ట్రైనీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం జరిగింది.ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా పాటించాల్సిన విధులు, పరేడ్ నిర్వహణ, సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు మరియు ట్రైనీ కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు.సెప్టెంబర్ 26న జరగనున్న పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్యాతిధిగా గౌరవ ఏపి విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఏపి దేవాదాయశాఖ మంత్రి మరియు ప్రకాశం జిల్లా ఇంచార్చి మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు, ఏపి సోషల్ వెల్ఫేర్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీ డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు, సౌత్ సెంట్రల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజి శ్రీ
సర్వశ్రేష్ట త్రిపాఠి ఐ.పి.ఎస్., గారు,ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఐ.ఏ.ఎస్., గారు, ప్రకాశం జిల్లా పి.టి.సి ప్రిన్సిపాల్ శ్రీ జీ.ఆర్. రాధిక ఐ.పి.ఎస్., ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు,అడిషనల్ ఎస్పీ (ఏఆర్)జీ. నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు,ట్రాఫిక్ సీఐ హజరత్తయ్యగారు, ఆర్ఐలు రమణారెడ్డి,సీతారామిరెడ్డి, ఓ. రవికుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.