
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల కందుకూరు నందు ఈనెల 28వ తేదీన మహాకవి నవయుగ కవి చక్రవర్తి ,విశ్వకవి సామ్రాట్, కవి కోకిల. గుర్రం జాషువా గారి 131 వ జయంతి సభ సందర్భంగా ఈరోజు లింగసముద్రం మండలం జంపాల వారి పాలెం గ్రామంలో జయంతి సభ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గౌడ పేరు కాంతారావు మాదిగ గారు మాట్లాడుతూ ఈ జయంతి సభలో సమాజంలోని అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాల , నాయకులు మరియు మండలంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగసముద్రం మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు జడవీరా స్వామి మాదిగ, కందుకూరు మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పోలిపోగు కిరణ్ కుమార్ మాదిగ మరియు జంపాల వారి పాలెం గ్రామ సభ్యులు పాల్గొన్నారు