
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్లో జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో జేడీబీఎం టౌన్ బ్యాప్టిస్ట్ చర్చ్తో పాటు వివిధ ప్రాంతాల్లో భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, ప్రతి నెల చివరి ఆదివారం దాతల సహకారంతో యాచకులు, నిరుపేదలు, దివ్యాంగులకు భోజనం అందిస్తున్నామని తెలిపారు. జేడీబీఎం టౌన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వద్ద స్త్రీల సమాజం అధ్యక్షురాలు జంగాల మణిరవి, జాయింట్ ట్రెజరర్ జంగాల వనజా ప్రభు కుమార్ భోజనం, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. అవసరంలో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, నితీష్, చరణ్ తేజ, వేణుబాబు పాల్గొన్నారు.