
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల రూ.22 కోట్ల వేతన బకాయిల సమస్యకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషంగా ఉంది.కార్మికుల కష్టాలను స్వయంగా విని, వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ సమస్యను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి రూ.22 కోట్ల బకాయిలను విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇక షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని యువతకు ఉపాధి, రైతులకు మేలు జరిగేలా వినియోగించే దిశగా ముందుకు సాగుతాం.