
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ విశాఖ :-
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది రెగ్యులరైజేషన్, సౌకర్యాల విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదని ఆ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది రెగ్యులరైజేషన్, సౌకర్యాల విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదు, రెగ్యులరైజేషన్ను మా ప్రభుత్వమే అమలు చేసింది. నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ ను ఇప్పటికే ఆర్థికశాఖకు పంపడం జరిగింది, నోషనల్ ఇంక్రిమెంట్స్ పై ఆర్థిక శాఖతో నిరంతరం పాలో అఫ్ చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పుడు ఒకరికొకరు సేవలు అందించేలా డీసెంట్రలైజ్ చేశాం. ఉద్యోగులకు ఆటోమేటిక్ లీవ్స్ సాంక్షన్ విధానం తీసుకొచ్చాం, ఉన్నతాధికారి స్పందించకున్నా రెండు రోజుల సీఎల్‌లు మంజూరయ్యే వెసులుబాటు కల్పించాం. వైసీపీ హయాంలో ఒక్క ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వలేదు, మేం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే సుమారు 14 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చాం, మిగతా వారికి నెల రోజుల్లో ప్రమోషన్లు కల్పిస్తాం. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కావాలని ఉద్యోగులు కోరుతున్నారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిషన్ వేస్తాం, ఉద్యోగులు తమ రిప్రెజెంటేషన్ కమిషన్ కి ఇవ్వండి. పిఆర్సి కమిషన్ నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. ఉద్యోగులను కొందరు రెచ్చగొట్టడం సరికాదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, ఉద్యోగులకు మేలు చేయాలన్న తపన తప్ప వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. మా ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగులకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులంతా సహకరించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.