
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు టిడిపి సీనియర్ నాయకులు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మంగళవారం శంకుస్థాపన చేశారు.గ్రామంలో మెయిన్ రోడ్డు నుంచి సచివాలయం వరకు 20 లక్షలతో ఈ రోడ్డును నిర్మించబోతున్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా కందుకూరు నియోజకవర్గంలో 131 పనులకు 26.58 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కందుకూరు మండలంలో 22 పనులకు 6.46 కోట్లు, వలేటివారిపాలెం మండలంలో 32 పనులకు 5.05 కోట్లు, లింగసముద్రం మండలంలో 36 పనులకు 7.69 కోట్లు, గుడ్లూరు మండలంలో 25 పనులకు 4.52 కోట్లు, ఉలవపాడు మండలంలో 16 పనులకు 2.85 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని ఆంజనేయులు, పార్టీ నాయకులు కాకుమాని హర్ష, వలేటి నరసింహం, గుత్తా మహేశ్వరరావు, తిరుపతయ్య, మధు, కొండయ్య, అంజయ్య, తిరుపతిస్వామి, బూదాల మనోజ్, మాజీ సర్పంచ్ సాదు శ్రీలత, బత్తుల సుబ్బారావు
నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.