
ఎమ్మెల్యే ఇంటూరి ఆధ్వర్యంలో 9 ఉత్సాహం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ప్రారంభించగా….. ఆ కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి వేలాదిగా జనం బయలుదేరి వెళ్లారు. సుమారు 200 బస్సులు, 150కి పైగా కార్లలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.వలేటివారిపాలెంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులు జెండా ఊపడంతో బస్సులు బయలుదేరాయి. కందుకూరు పట్టణం సహా 5 మండలాల నుంచి యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మధ్యలో మాలకొండ దేవస్థానం సమీపంలోని రాజుగారి కొష్టాలు వద్ద ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వేలాదిమందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. అనంతరం బస్సులు, కార్లు ర్యాలీగా రామాపురం చేరుకోగా…. అక్కడి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు ఎం. శ్రావణిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిని శ్రీనివాసరావు, పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, పూరిమిట్ల గురునాథం, జనిగర్ల నాగరాజు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ మరియు వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.