
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
రాష్ట్రస్థాయి అండర్-19 చదరంగ పోటీలకు సింగరాయకొండకు చెందిన సయ్యద్ షఫీజ్, కె. రిషిత ఎంపికయ్యారు.సెప్టెంబర్ 29న ఒంగోలులోని ఓరియంటల్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టుకు మొత్తం ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఎంపికయ్యారు. వీరిలో సింగరాయకొండ నుంచి ఒక బాలుడు, ఒక బాలిక చోటు దక్కించుకోవడం విశేషం.సయ్యద్ షఫీజ్ సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, కె. రిషిత బాష్యం స్కూల్ విద్యార్థిని.ఎంపికైన క్రీడాకారులు ప్రకాశం జిల్లా తరఫున అక్టోబర్ 1, 2 తేదీల్లో ఏలూరు జిల్లా పెదవేగిలో జరిగే రాష్ట్రస్థాయి అండర్-19 చదరంగ పోటీల్లో పాల్గొననున్నారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన షఫీజ్, రిషితలను అధ్యాపకులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు అభినందిస్తూ రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.