
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) గౌదగట్లవారి పాలెంలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మొత్తం 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ చైర్మన్‌గా అరివేని కుమారి, వైస్‌చైర్మన్‌గా ఎందేటి దేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికైన ఎస్ఎంసీ సభ్యులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమిటీ కన్వీనర్ అర్రిబోయిన రాంబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యసన ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం వంటి అంశాల్లో ఎస్ఎంసీ కీలక పాత్ర పోషించాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు.పాఠశాల అభివృద్ధికి సహకారం
పాఠశాల పూర్వ విద్యార్థులు సవిడిబోయిన మురళి, పిగిలి భాస్కర్, గవదగట్ల రమణయ్య కార్యక్రమంలో పాల్గొని పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రుల భాగస్వామ్యమే కీలకం ఎస్ఎంసీ ద్వారా పాఠశాల అవసరాలను గుర్తించి, విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. “బడి మనది–బాధ్యత మన అందరిది” అనే స్ఫూర్తితో పాఠశాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సభ్యులు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అజయ్ కుమార్ చౌదరి, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక అంగన్వాడీ కార్యకర్త రజినీకుమారి, ఆశా కార్యకర్త రూపాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.