
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
క్యాన్సర్ వ్యాధి తో భాధపడుతున్న మన గ్రామానికి చెందిన జంపాని సునీత కు పార్టీ క్యాడర్ సహకారంతో గ్రామ తెదేపా ప్రతి నెల ఒకటవ తేదీ 5000/- ఆర్థిక సహకారం అందించాలని గ్రామ తెదేపా నిర్ణయం తీసుకుంది..
ఇటీవల ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆ ST కాలనీకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం గురించి స్థానిక కాలనీ వాసులు పార్టీ ద్రుష్టికి తీసుకుని రావడం జరిగింది..స్పందించిన గ్రామ పార్టీ సునీతకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు అవకాశం లేనందున వారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంది..అందులో భాగంగా గురువారం మన టంగుటూరు SI ఫణిభూషన్ గారి చేతుల మీదగా భాధితురాలకు 5000/- ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కామ్రేడ్ పమిడి కోటయ్య - వెంకట శేషమ్మ విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు కాట్రగడ్డ రమేష్ బాబు స్థానిక తెదేపా నాయకులు పాల్గొన్నారు..