
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
పేదల సేవలో 2.0” – సంక్షేమ పథకాల పంపిణీ వివరాలు , P4 కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు . పేద కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ సమన్వయం చేసి వారికి గరిష్ఠ ప్రయోజనం కల్పించడంతో పాటు, పేదరికం మరియు ఆర్థిక అసమానతలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “పేదల సేవలో 2.0” కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని 30వ డివిజన్ హిల్ టవర్స్ ప్రాంతం నందు పర్యటించి ముందుగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేపట్టారు. అనంతరం డివిజన్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం వంటి పథకాల ద్వారా పేద కుటుంబాలకు అందుతున్న తీరు, P4 కార్యక్రమం ద్వారా డివిజన్లలో పేద కుటుంబాలకు మార్గదర్శకులను అనుసంధానం చేసి, వారి అభివృద్ధికి తీసుకుకుంటున్న చర్యలపై సమీక్షా చేపట్టారు. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత నగరంలో ప్రధాన రోడ్లు విస్తరణ చేపట్టడం, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు జనార్దన్ గారు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గత నెలలో 70 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయడు గారు కేటాయించడం జరిగినది అన్ని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జనార్దన్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.