
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
రాయలసీమలో కరువును
రూపుమాపడంలో భాగంగా…. లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈరోజు మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వేడుకను కందుకూరు
మండలం ఓగూరులోని రైతుసేవా కేంద్రంలో…. రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ప్రత్యక్షంగా వీక్షించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు
మాట్లాడుతూ.. రాయలసీమ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం, రాయితీలు ఇవ్వడం, పంట ఉత్పత్తి, గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్, నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయటం లాంటి వస్తువులన్నీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అందులో కందుకూరు నియోజక వర్గాన్ని చేర్చినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు గారి హయాంలో
పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తీసుకువచ్చి, సబ్సిడీపై స్ప్రింకర్లు, ఇతర పరికరాలు అందించారని ఎమ్మెల్యే తెలిపారు. తక్కువ పెట్టుబడి, తక్కువ
నీటి వసతినతో… ఎక్కువ లాభాలు పొందేలా ఉద్యాన పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ
చైర్మన్ రాయపాటి సుభాషిని శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడిఈ రహీం, మండల టిడిపి అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు చల్లా నాగేశ్వరరావు, పచ్చవ తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు.