
రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా – అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు మరియు వాహనాలపై ముమ్మర తనిఖీలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ బస్స్టాండ్లలో ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా బస్స్టాండ్లలోని ప్రయాణికుల రాకపోకల ప్రాంతాలు, ప్లాట్ఫారాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు తదితర ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.ప్రయాణికులు తమ సామానుపై అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎటువంటి వస్తువులు స్వీకరించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించేందుకు బస్స్టాండ్లలో పోలీసుల నిఘా మరియు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.