
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలంలోని తే ట్టు సెక్టార్ లోని మొండి వారి పాలెం గ్రామంలో అంగన్వాడి సెంటర్ నందు 9వ పోషక ఆహారం ఉత్సవాలు జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు బాలింతలు, కిషోర్ బాలికలు ఇతర తల్లులకు పౌష్టికాహారం గురించి తెలియజేయడమైనది అలానే మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు కాయగూరలు, పండ్లు పాలు పాలు పదార్థాలు చిరుధాన్యాలు సజ్జలు, రాగులు జొన్నలు, క్యారెట్టు బీట్రూట్ మునగాకు కరివేపాకు ఎక్కువగా వాడుకోవాలని తెలియజేయడమైనది ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలియజేయడమైనది ప్రాంతీయ వంటకాలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కల్పించటమైనది సెంటర్లో తాజాగా భోజనం భాగస్వామ్యం మరియు బాధ్యత పోషణ మరియు బాల ప్రేరణ ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఈ విషయంపై తల్లులకు తెలియజేయడమైనది ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం ప్రసాద్ టీచర్ గంగాభవాని ఆశ అనురాధ కార్యకర్తలు వి మీ అలివేలు జి మౌనిక హాజరైనారు