
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఈవీ. రమణబాబును జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం కలెక్టరేట్లో ప్రత్యేకంగా అభినందించారు.స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ మున్సిపాలిటీ–2026 రాష్ట్రస్థాయి అవార్డుకు గిద్దలూరు మున్సిపాలిటీ ఎంపిక కావడంపై కలెక్టర్ ప్రశంసించారు. పారిశుద్ధ్యం, డోర్ టు డోర్ చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమాల్లో చేపట్టిన చర్యలకు ఈ గుర్తింపు లభించిందన్నారు.