
లాడ్జీల్లో అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి – ప్రజల భద్రత, నేరాల నియంత్రణకు పోలీసుల ముమ్మర తనిఖీలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల భద్రత, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని లాడ్జీలను ప్రకాశం జిల్లా పోలీసులు తనిఖీ చేశారు.తనిఖీల్లో భాగంగా లాడ్జీలలోని గదులు, ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాలు, సందర్శకుల వివరాలు, రిజిస్టర్లు మరియు భద్రతా ఏర్పాట్లను పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు ఉన్నాయా అనే అంశంపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
లాడ్జి నిర్వాహకులు వచ్చే అతిథుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, గుర్తింపు పత్రాలను పరిశీలించాలని, అనుమానాస్పద కదలికలు లేదా వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.నేరాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా లాడ్జీలు, హోటళ్లు మరియు ఇతర వసతి ప్రాంతాలపై పోలీసుల తనిఖీలు, నిఘా నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
నేరాల నియంత్రణకు ముందస్తు నిఘా – ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా ప్రకాశం జిల్లా పోలీసులు.