
ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన చీమకుర్తి పోలీసులు – సరైన ధ్రువపత్రాలు, రికార్డులు లేని వాహనాలపై ప్రత్యేక చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , చీమకుర్తి పట్టణంలోని గరికమిట్ట ప్రాంతంలో చీమకుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.ఈ ఆపరేషన్లో 3 మంది ఎస్ఐలు మరియు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్లో భాగంగా గరికమిట్ట ప్రాంతంలోని అన్ని ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు ఇతర అంశాలను పరిశీలించారు.తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేదా చెల్లుబాటు అయ్యే రికార్డులు లేని 14 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుని తదుపరి ధృవీకరణ మరియు అవసరమైన చట్టపరమైన చర్యల నిమిత్తం చీమకుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు.నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నివారణ మరియు ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.